న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కార ణంగా వంట గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో...ఇండక్షన్ హీటర్లు, వాటికి సరిపోయే పాత్రల ఉత్పత్తిని పెంచే మార్గాలపై ప్రభుత్వం చర్చించింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
గ్యాస్ కొరత ఏర్పడటంతో జనం ఇండక్షన్ స్టౌల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. పరిశ్రమలకు ఊరటనిస్తూ కొన్ని రసాయనాల దిగుమతిపై జూన్ 30 వరకు కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు.
