కరోనా పరిస్థితి ఎదుర్కొనేందుకు ..దేశమంతటా మాక్​డ్రిల్

కరోనా పరిస్థితి ఎదుర్కొనేందుకు ..దేశమంతటా మాక్​డ్రిల్

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని గవర్నమెంట్, ప్రైవేట్​ హాస్పిటల్స్​లో మాక్ ​డ్రిల్  నిర్వహించింది. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి, సిబ్బంది, టెస్టింగ్ ​కెపాసిటీ, మెడికల్​ లాజిస్టిక్స్, టెలి మెడిసిన్, ఆక్సిజన్​ సిలిండర్లతో పాటు వెంటిలేటర్లు వంటి కీలక అంశాలను పరిశీలించారు.

కేసులు పెరిగితే రోగులకు అందే వైద్య సేవలపై మాక్​డ్రిల్ చేపట్టింది. ఢిల్లీలోని లోక్​నాయక్​ జై ప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్​జేపీ) హాస్పిటల్​లో నిర్వహించిన మాక్​డ్రిల్​లో డిప్యూటీ సీఎం మనీశ్​సిసోడియా పాల్గొన్నారు. 2 వేల పడకల హాస్పిటల్​లో 450 బెడ్లు కరోనా కోసం కేటాయించామని తెలిపారు. ఇవి సరిపోకపోతే హాస్పిటల్​కు దగ్గర్లోని బాంకెట్​హాల్స్​లో 500 బెడ్స్​ అదనంగా ఏర్పాటు చేస్తామని, దీంతో బెడ్స్ కొరత ఉండదన్నారు. మాక్​డ్రిల్​ సక్సెస్​ అయ్యిందని ఎల్ఎన్​జేపీ హాస్పిటల్​ ఎండీ​ సురేశ్ కుమార్​ మీడియాకు వెల్లడించారు. 

లోపాలుంటే సరిచేసుకోవచ్చు: మాండవీయ

సఫ్దర్ జంగ్​ హాస్పిటల్​లో నిర్వహించిన మాక్​డ్రిల్​లో కేంద్ర మంత్రి మన్​సుఖ్​ మాండవీయ పాల్గొన్నారు. అక్కడి సౌలత్​ల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు డాక్టర్లకు పలు సూచనలు చేశారు.  ఇలా డ్రిల్ చేపట్టడంతో తాము ఎంత వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌కు రెడీగా ఉన్నామో తెలుస్తుంద‌‌‌‌ని, లోపాలు ఉంటే స‌‌‌‌రిచేసుకోవచ్చని మాండ‌‌‌‌వీయ తెలిపారు.