కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

బుధవారం భేటి అయిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడవ విడతలో 80,250 కోట్లతో లక్షా 25 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసులకు గ్రూప్ ఏ స్టేటస్ కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది

పోక్సో చట్టం (2012) సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా ఈ చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనుంది.

ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ 2019 బిల్లుకు ఆమోదం తెలిపింది. ట్రాన్స్ జెండర్ల ఆర్ధిక సామాజిక విద్యా అత్యున్నతికి చర్యలు తీసుకునేలా బిల్లు ప్రవేశపెట్టనుంది.

అంతర్ రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్ట సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది

ఉద్యోగులకు వృత్తపరమైన భద్రత,ఆరోగ్యం,పనివాతావరణం ప్రధానాంశాలుగా నూతన కోడ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను నూతన కోడ్ పరిధిలోకి తీసుకురానుంది. పదిమందికి పైగా ఉండే అన్ని పరిశ్రమలకు కోడ్ వర్తించనుంది.