
తెలంగాణలో వరద నష్టం అంచనాపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఈ కమిటీని కేంద్రం నియమించింది. ఇందులో వ్యవసాయ, ఆర్థిక, విద్యుత్, జల్ శక్తి, రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరు రాష్ట్రంలో ఈ నెల 31 (సోమవారం) నుంచి పర్యటిస్తారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి కేంద్రానికి నివేదికను సమర్పిస్తారు.