ఎన్నికల ప్రచారం చేయకుండా సూర్జేవాలాపై బ్యాన్​

ఎన్నికల ప్రచారం చేయకుండా సూర్జేవాలాపై బ్యాన్​

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ యాక్టర్ హేమమాలినిపై కామెంట్లు చేసినందుకుగాను కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. రెండ్రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో రణదీప్ పాల్గొనకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

యూపీలోని మధుర ఎంపీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న హేమమాలినిపై ఈ నెల మొదట్లో రణదీప్ సూర్జేవాలా అసభ్యకరంగా కామెంట్లు చేశారంటూ ఓ వీడియోను బీజేపీ షేర్ చేసింది. ‘ప్రజల గొంతును వినిపిస్తారని లీడర్లను జనం ఎన్నుకుంటరు. హేమమాలిని వంటి ఫిల్మ్ స్టార్​లను ఎన్నుకోరు”అని ఆ వీడియోలో సూర్జేవాలా అన్నట్లుగా ఉంది. దీని ఆధారంగా 
బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.