యాదాద్రి ప్లాంట్​కు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ ​సిగ్నల్

యాదాద్రి  ప్లాంట్​కు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ ​సిగ్నల్

హైదరాబాద్, వెలుగు :  యాదాద్రి పవర్ ప్లాంట్​కు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం సూచన ప్రకారం మరో విడత ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపండతో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ యాదాద్రి పవర్ ప్లాంట్ కు పర్మిషన్​ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి ప్లాంట్ కరెంటు ఉత్పత్తి కెపాసిటీ 4వేల మెగావాట్లు. ఈ ప్లాంటు పూర్తయితే రాష్ట్రానికి మరో నాలుగు వేల మెగావాట్ల అదనపు విద్యుత్ అందుబాటులోకి రానుంది. మొదటి విడతగా 800 మెగా వాట్ల కెపాసిటీ ఉన్న రెండు యూనిట్లతో 1600 మెగా వాట్ల విద్యుత్ ను జెన్​కో ఉత్పత్తి చేయనుంది.

రెండో విడతలో 800 మెగావాట్ల కెపాసిటీ ఉన్న మూడు యూనిట్లతో 2400 మెగా వాట్ల కరెంటు ఉత్పత్తి చేయనున్నారు. యాదాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి చేపడితే నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని, దాని అనుమతులు రద్దు చేయాలంటూ ముంబైకి చెందిన కన్జర్వేటీవ్ యాక్షన్ ట్రస్ట్, విశాఖపట్నంకు చెందిన సమత స్వచ్ఛంద సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) లో ఫిర్యాదు చేశాయి. దీంతో అనుమతులపై ఎన్జీటీ స్టే విధించింది. వన్యప్రాణులకు ఏర్పడే ముప్పుపై స్టడీ చేసి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం సూచన ప్రకారం మరో విడత ప్రజాభిప్రాయ సేకరణ చేసి పంపండతో  తాజాగా  కేంద్ర అటవీ పర్యావరణ శాఖ యాదాద్రి పవర్ ప్లాంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.