20న తెలంగాణకు కేంద్ర బలగాలు

20న  తెలంగాణకు కేంద్ర బలగాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎలక్షన్ బందోబస్తు కోసం ఈ నెల 20న కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.స్థానిక పోలీసులతో పాటు దాదాపు 300 కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ విధులు నిర్వహించనున్నాయి.డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులతో కలిసి పనిచేయనున్నాయి. 

ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు 7 ప్లాటూన్స్ కేంద్ర బలగాలను కేటాయించారు.ఈ  క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది పోలీసులతో  అవసరమైన విధంగా ప్లాటూన్స్‌‌‌‌‌‌‌‌ తరలించనున్నారు.ఈసీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.