
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కేం ద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్టేట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. మినీ అంగన్‌వాడీల్లో ప్రస్తుతం టీచర్లే ఆయా పని కూడా చేస్తున్నారు.
అప్‌గ్రేడ్ చేయడంతో టీచర్‌తో పాటు ఆయాను నియమించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. టీచర్ వేతనం రూ.7,800 నుంచి రూ.13,650కు పెరుగుతుంది. ఇందులో రూ.4,500 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అంగన్‌వాడీల అప్‌గ్రెడేషన్ కోరుతూ రాష్ట్ర సర్కార్ కేంద్రానికి లేఖ రాయగా అనుమతి ఇచ్చింది. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.