స్పీడు పెంచిన ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ డేట్స్ ఇచ్చేశాడు

స్పీడు పెంచిన ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ డేట్స్ ఇచ్చేశాడు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌‌‌‌ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం  తన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.  వాటిలో ముందుగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజి’ సినిమా దాదాపు యాభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది. ఇది సెట్స్‌‌‌‌పై ఉండగానే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌లో ‘స్పిరిట్‌‌‌‌’ షూటింగ్ మొదలైంది. 

ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌‌‌‌పై మాత్రమే ప్రభాస్‌‌‌‌ ఫోకస్ పెడతాడని, ఇవి పూర్తయ్యాకే తర్వాతి చిత్రాల షూట్ మొదలవుతుందని అంతా భావించారు. కానీ స్పీడు పెంచిన ప్రభాస్.. ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌‌‌‌కు డేట్స్‌‌‌‌ కేటాయించినట్టు తెలుస్తోంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్‌‌‌‌ ఫిక్షన్‌‌‌‌ మూవీకి ఫిబ్రవరిలో దాదాపు పదిరోజుల డేట్స్‌‌‌‌ ఇచ్చాడట ప్రభాస్. దీంతో ఫిబ్రవరి తొలివారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

మరోవైపు ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్‌‌‌‌ నీల్..  ఆ షూట్ పూర్తయ్యాక  ‘సాలార్‌‌‌‌‌‌‌‌ 2’పై దృష్టి సారించనున్నాడు.  ఇక వచ్చే ఏడాది మార్చి 5న ‘స్పిరిట్‌‌‌‌’ రాబోతోందని ఇప్పటికే ప్రకటించారు. అంతకంటే ముందే ‘ఫౌజి’ వస్తుందా లేక ఆ తర్వాత రిలీజ్ ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది.