పోయిన ఏడాది 3,502 కిలోల పసిడి స్వాధీనం

పోయిన ఏడాది 3,502 కిలోల పసిడి స్వాధీనం

న్యూఢిల్లీ:  బంగారం స్మగ్గింగ్​ పోయిన ఏడాది దాదాపు 47 శాతం పెరిగిందని, 3,502 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నామని కేంద్రం  ప్రకటించింది.   ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కిలోల బంగారాన్ని, అంతకు ముందు సంవత్సరంలో 2,154.58 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

2023 మొదటి రెండు నెలల్లో 916.37 కిలోల స్మగు​ల్డ్ బంగారం పట్టుబడింది. బంగారం స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ను అరికట్టడానికి కస్టమ్స్ ఫీల్డ్ ఫార్మేషన్లు,  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్​ఐ)  నిరంతరం నిఘా ఉంచుతాయి.  స్మగ్లింగ్​ను ఆపడానికి ప్రయాణీకుల ప్రొఫైలింగ్, కార్గో సరుకుల తనిఖీ వంటి చర్యలు తీసుకుంటున్నారు.