కరెంటును తయారు చేయాల్సిందే:గ్యాస్​ప్లాంట్లకు కేంద్రం ఆదేశం

కరెంటును తయారు చేయాల్సిందే:గ్యాస్​ప్లాంట్లకు కేంద్రం ఆదేశం
  • కరెంట్​ డిమాండ్ పెరగడమే కారణం

న్యూఢిల్లీ: కరెంటుకు డిమాండ్​ పెరగడంతో ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 30 వరకు అన్ని గ్యాస్ ఆధారిత కరెంట్​ఉత్పత్తి కేంద్రాలు తమ ప్లాంట్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది.  గ్యాస్- బేస్డ్ జనరేటింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లలో (జీబీఎస్) చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. వాణిజ్యపరమైన  కారణాలతో ఇవి మూతపడే ఉన్నాయి. ఈ వేసవిలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) 260 గిగావాట్ల గరిష్ట కరెంట్​ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉండొచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో గరిష్ట కరెంట్​ డిమాండ్ 243 గిగావాట్ల ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 

వేసవిలో కరెంట్​‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను తీర్చేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే జీబీఎస్‌‌‌‌‌‌‌‌లను తెరిపించాలనే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యుత్​మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, మే 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు కరెంట్​ ఉత్పత్తి  సరఫరా కోసం ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాల నుంచి గరిష్ట కరెంట్​ ఉత్పత్తిని తీయడానికి, విద్యుత్​ చట్టం, 2003లోని సెక్షన్ 11ను ప్రయోగించామని సంబంధిత అధికారులు తెలిపారు. 

దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత కరెంట్​ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ల మాదిరిగానే అధిక డిమాండ్ కాలంలో జీబీఎస్​ల నుంచి కూడా కరెంట్ లభ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.   గ్యాస్ ఆధారిత కరెంట్ ఎన్ని రోజులకు అవసరమో గ్రిడ్​ఇండియా ముందుగానే జీబీఎస్​లకు తెలియజేస్తుంది.