ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను

ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను

నిన్నటి దాక టమాటాల రేట్లు ఆకాశన్నంటాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల కేజీకి 100 రూపాయలకు పైగానే అమ్ముతున్నారు. కొన్ని చోట్ల మాత్రం కిలో 50కే ఇస్తున్నారు. టామాటాల బాటలో ఉల్లిపాయల రేట్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. వారం, 10 రోజులుగా ఇదే న్యూస్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే..

కేంద్ర ప్రభుత్వం శనివారం (ఆగస్టు 19న) ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం 2023, డిసెంబర్ 31వ తేదీ వరకూ వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇండియాలో పండే ఉల్లిపాయలు ఇతర దేశాలకు ప్రతి ఏటా ఎగుమతులు జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.