పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన కేంద్రం

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన కేంద్రం

పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయలు
వినియోగం తక్కువగా ఉండటమే కారణమంటున్న ప్రభుత్వం

లాక్డౌన్ వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. లాక్డౌన్ వల్ల దేశంమొత్తం స్తంభించిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో పెట్రోల్, డీజిల్ వినియోగం సగానికి పైగా తగ్గిపోయింది. లాక్డౌన్ దెబ్బకు అంతర్జాతీయ చమురు ధరలు రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దాంతో వ్యాట్, ఎక్సైజ్ సుంకం రూపంలో వచ్చే ఆదాయానికి గండిపడింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 1.6 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అయితే పెరిగిన ఎక్సైజ్ సుంకం వల్ల రిటైల్ ధరలలో మార్పు రాదని అధికారులు తెలిపారు.

పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 2 రూపాయలు పెంచడంతో పాటు రోడ్ సెస్‌ను లీటరుకు 8 రూపాయలు పెంచారు. డీజిల్ విషయంలో ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 5 రూపాయలు మరియు రోడ్ సెస్‌ను లీటరుకు రూ .8 పెంచారు. దాంతో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మొత్తం లీటరుకు రూ .32.98కు, డీజిల్‌పై రూ .11.83కు పెరిగింది.

అంతర్జాతీయ చమురు ధరల తగ్గుదల వల్ల వచ్చే నష్టాలను తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని గత మార్చిలో పెంచింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పెంచింది. మార్చిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 3 రూపాయలు పెంచడం వల్ల ప్రభుత్వం సుమారు 39,000 కోట్ల రూపాయలు ఆర్జించింది.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్‌పై లీటరుకు 9.48రూపాయలు, డీజిల్‌పై లీటరుకు రూ .3.36 పన్ను విధించారు. ప్రపంచ చమురు ధరలు క్షీణించడం వల్ల కలిగే నష్టాలను పూడ్చుకోవడం కోసం ప్రభుత్వం నవంబర్ 2014 మరియు జనవరి 2016 మధ్య తొమ్మిది సార్లు పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

For More News..

యాక్టర్ శివాజీ రాజాకు హార్ట్ఎటాక్

జైలులో మర్మాంగాలను కత్తిరించుకున్న ఖైదీ

కారులో బిడ్డను ప్రసవించిన గర్భవతి