టెన్త్​తో సెంట్రల్​ కొలువు

టెన్త్​తో సెంట్రల్​ కొలువు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్​ఎస్​సీ) నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా 11,400 మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది.

అర్హతలు: అభ్యర్థులు  పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూ‌‌బీడీ(ఓబీసీ)-13 ఏళ్లు, పీడబ్ల్యూబీ‌‌డీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు - 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 17 వరకు రూ.100 అప్లికేషన్​ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఎస్​ఎస్​సీ ఎమ్​టీఎస్​ అండ్‌‌ హవల్దార్ 2022 పరీక్ష 2023 ఏప్రిల్‌‌లో జరగనుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌‌లో ఉంటుంది. అయితే పరీక్ష తేదీలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్‌‌ఎస్‌‌సీ అధికారిక వెబ్‌‌సైట్‌‌ www.ssc.nic.in చూడొచ్చు.