
కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్రాడ్కాస్ట్ ఎగ్జిక్యూటివ్, కాపీ రైటర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21.
పోస్టుల సంఖ్య: 59.
పోస్టులు: సీనియర్ కరస్పాండెంట్ 02(హైదరాబాద్ 01), యాంకర్ కం కరస్పాండెంట్ గ్రేడ్ – II 07(హైదరాబాద్ 02), యాంకర్ కం కరస్పాండెంట్ గ్రేడ్– - III 10 (హైదరాబాద్ 02), బులెటిన్ ఎడిటర్ 04 (హైదరాబాద్ 01), బ్రాడ్కాస్ట్ ఎగ్జిక్యూటివ్ 04, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ 02(హైదరాబాద్ 01), అసైన్మెంట్ కో–ఆర్డినేటర్ 03, కంటెంట్ ఎగ్జిక్యూటివ్ 08(హైదరాబాద్ 01), కాపీ ఎడిటర్ 07(హైదరాబాద్ 01), కాపీ రైటర్ 01, ప్యాకేజింగ్ అసిస్టెంట్ 06 (హైదరాబాద్ 01), వీడియోగ్రాఫర్ 05 (హైదరాబాద్ 02).
ఎలిజిబిలిటీ: సీనియర్ కరస్పాండెంట్, అసైన్మెంట్ కో–ఆర్డినేటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
యాంకర్ కం కరస్పాండెంట్ గ్రేడ్ - II: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీతో పాటు జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్/ విజువల్ కమ్యూనికేషన్/ న్యూస్ యాంకరింగ్/ రిపోర్టింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్/ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
బులెటిన్ ఎడిటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీతోపాటు జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. లేదా జర్నలిజం/ మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
బ్రాడ్కాస్ట్ ఎగ్జిక్యూటివ్: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి రేడియో/ టీవీ ప్రొడక్షన్లో ప్రొఫెషనల్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఫిల్మ్, వీడియో ఎడిటింగ్‌లో ప్రొఫెషనల్ డిప్లొమా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వీడియోగ్రాఫర్: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10+ 2తోపాటు సినిమోటోగ్రఫీ/ వీడియోగ్రఫీలో డిగ్రీ/ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 30 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 07.
లాస్ట్ డేట్: అక్టోబర్ 21.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు prasarbharati.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.