కేంద్రం ప్రభుత్వ పథకం..విద్యార్థులకు రూ.2లక్షలు..వివరాలివే

కేంద్రం ప్రభుత్వ పథకం..విద్యార్థులకు రూ.2లక్షలు..వివరాలివే

విద్యార్థులకు మంచి అవకాశం.. అంతర్జాతీయ స్థాయిలో మీ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా.. అదే స్థాయిలో మీ సామర్థ్యాన్ని చూపించాలనుకుంటున్నారా.. ఎకనామికల్ సపోర్ట్ లేక వెనక డుగు వేస్తున్నారా..అయితే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుత పథకాన్ని అమలు చేస్తోంది. అదే AICTE SSPC స్కీం. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్స్ పెంచు కోవచ్చు.  నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంటర్నేషన్ లెవల్ లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చు. 

 AICTE ద్వారా కేంద్ర ప్రభుత్వం అలాంటి విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది.  కేంద్ర  ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రారంభించిన పథకమే.. సపోర్ట్ స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపీటింగ్ ఇన్ కాంపిటిషన్స్ ఎబ్రాడ్ (SSPCA). సింపుల్ గా చెప్పాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో కాంపిటిషన్లలో పాల్గొనే విద్యార్థులకు ఈ పథకం ద్వారా మనీ ఇస్తారు. ఒక్క విద్యార్థికి రూ. 2లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తారు. ః

ఈ ఆర్థిక సాయంతో ట్రావెలింగ్, విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది. దీంతోపాటు విద్యార్థికి మెంటరింగ్, లాజిస్టికల్ సలహాలు కూడా ఇస్తారు. విద్యార్థికి ఇచ్చే డబ్బును ముందుగా ఇవ్వకుండా.. రీఎంబర్స్ మెంట్ రూపంలో చెల్లిస్తారు. విద్యార్థికి ఇచ్చే మనీలో దేశీయ, అంతర్జాతీయ ట్రావెల్ ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఫీజు, వీసా అప్లికేషన్ ఫీజు, లాడ్జి ఖర్చులు, ఎయిర్ పోర్ట్ చార్జీలు, ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా ఇతర కాంపిటిషన్ కి సంబంధించిన ఖర్చులను చెల్లిస్తారు. 

ఈ పథకం AICTE ఆమోదించిన యూనివర్సిటీల్లో డిప్లామా, BE/BTech, ఇంటిగ్రేటెడ్ MTech, MBA, హోటల్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ లు చేసే విద్యార్థులకు వర్తిస్తుంది. కాంపిటీషన్ గడువు పది రోజుల లోపు ఉండాలి. ఒక్కో విద్యార్థికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి లేదా గ్రూపులుగా  పాల్గొనవచ్చు. విదేశాల్లో పాల్గొనేముందు దేశీయం పోటీల్లో పాల్గొని విన్ అయి ఉండాలి.