ఈవీల కోసం రూ.500 కోట్లు

ఈవీల కోసం రూ.500 కోట్లు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి కేంద్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.500 కోట్లు కేటాయిస్తారు. ఈ పథకం జులై వరకు అమల్లో ఉంటుంది. ఈవీల కోసం రూ.10 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ఫేమ్​–2 పథకం  మార్చి 31న ముగుస్తోంది. ఈ కొత్త పథకం కింద, ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.333.39 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఇస్తారు. ఈ–-రిక్షాలు,  ఈ–-కార్ట్​ల కోసం రూ.33.97 కోట్లు కేటాయిస్తారు.  గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి మరో రూ.126.19 కోట్లు ఇస్తారు. ఫోర్​వీలర్లకు ఈ పథకం వర్తించదు.