మారటోరియం మరో రెండేళ్లు పెంచే యోచనలో కేంద్రం!

మారటోరియం మరో రెండేళ్లు పెంచే యోచనలో కేంద్రం!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం లోన్ల మొరటోరియం గడువును మరో రెండేళ్ల వరకు పొడిగించవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయితే మొరటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్రం, ఆర్‌బీఐ మరియు బ్యాంకర్ల సంఘం కలిసి నిర్ణయించాల్సి ఉందని ప్రభుత్వం మంగళవారం కోర్టుకు తెలిపింది.

కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ‘మొరటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని వదులుకునే అంశంపై కేంద్రం, ఆర్‌బీఐ, మరియు బ్యాంకర్ల సంఘం అనుమతి తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇప్పటికే జీడీపీ 23 శాతం తగ్గింది మరియు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’అని ఆయన అన్నారు.

అయితే కేంద్రం యొక్క నిర్ణయం ఇంకా తమకు చేరలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు కేసును బుధవారానికి వాయిదా వేసింది. మొరటోరియం సమయంలో రుణాలపై చెల్లించే వడ్డీ మాఫీ చేయడంపై కేంద్రం తమ అభిప్రాయం తెలపాలని సుప్రీంకోర్టు గత వారం కోరింది.

టర్మ్ లోన్లపై మొరటోరియం సమయంలో వడ్డీ మినహాయింపు ఉండదని ఆర్‌బీఐ గతంలోనే కోర్టుకు తెలియజేసింది. ఇలా వడ్డీ మినహాయింపు ఇస్తే.. బ్యాంకులు ఆర్థికంగా ప్రమాదంలో పడుతుందని తెలిపింది.

For More News..

దాదాకు నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా తెలంగాణ కేడర్ మహిళా ఐపీఎస్

రాష్ట్రంలో మరో 2,734 కరోనా కేసులు