తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కిషన్ రెడ్డి హామీ

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కిషన్ రెడ్డి హామీ

తల్లిదండ్రులను కోల్పోయినా మీకు భారత మాత మీకు అండగా ఉంటుంది. రూ.10లక్షల రూపాయలు, నెలనెలా స్టైఫండ్, ఇతర అన్ని రకాల సహాయాలు అందజేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆయన పీఎం కేర్స్ సర్టిఫికెట్స్ అందజేశారు. మన్ కి బాత్ లో  ఇచ్చిన మాట ప్రకారం కొవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకుంటామన్నారు. అనారోగ్యం వచ్చినా ఎవరిమీదా ఆదార పడకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చామన్న ఆయన.. వారికి స్నేహ మిత్ర సర్టిఫికేట్ కూడా అందజేశామని వెల్లడించారు. ఎక్కడ చదువుకున్నా ఫీజు భరిస్తామని, వారు హాస్టల్ లో ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. 4వేల పైచిలుకు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులందరికీ ఈ సాయం వర్తిస్తుందని అన్నారు. హైదరాబాద్ సిటీలో 12మందిని గుర్తించామని కిషన్ రెడ్డి చెప్పారు. వారిలో అనేక మంది మైనర్లు కూడా ఉన్నారని... తానే, కలెక్టరేట్ కు స్వయంగా వెళ్లి ఈ స్కీం పత్రాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, అధికారులు, భాజపా కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

అనాథలను కేంద్రం దత్తత తీసుకుంటుంది

నేపాల్ విమాన ప్రమాదం.. 14 మృతదేహాల వెలికితీత