ఆరేండ్లలోపు పిల్లలకు పరీక్షలొద్దు… కేంద్రం గైడ్ లైన్స్ విడుదల 

ఆరేండ్లలోపు పిల్లలకు  పరీక్షలొద్దు…  కేంద్రం గైడ్ లైన్స్ విడుదల 

‘ప్రీ స్కూల్ స్థాయిలో మూడు నుంచి ఆరేండ్లలోపు పిల్లలకు ఇకపై ఎలాంటి టెస్ట్ లు పెట్టొద్దు. వీళ్లకు పాస్, ఫెయిల్ అస్సలే ఉండొద్దు. ప్రోగ్రెస్ ఆధారంగానే వాళ్ల చదువును అంచనా వేయాలె. పిల్లల లోపాలపై కాదు.. బలాలపై ఫోకస్ పెట్టాలె’ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్ సీఈఆర్ టీ) రూపొందించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది.

గైడ్ లైన్స్ ఇవే..

  ప్రీ స్కూల్‌ పిల్లల యాక్టివిటీస్‌ను క్వాలిటేటివ్ జడ్జిమెంట్ ప్రకారం అంచనా వేయాలి. 

    పిల్లలు ఎక్కడ? ఎలా గడుపుతున్నారు? ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు? భాష ఎలా వాడుతున్నారు? పక్కవాళ్లతో ఇంటరాక్ట్ అవుతున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? తిండి అలవాట్లు ఎలా ఉన్నాయి? అంశాల ఆధారంగా అసెస్ చేయాలి.

    పిల్లలకు నేర్పించే వివిధ అంశాలపై టీచర్లు ఫోకస్ పెట్టి పోర్ట్ ఫోలియోను సిద్ధం చేసుకోవాలి. ఆర్ట్, పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్ వంటివి అందులో భాగంగా ఉండాలి.

    పిల్లల ప్రోగ్రెస్‌ను అంచనా వేసేందుకు ఆడియో, వీడియోలను రికార్డ్ చేయాలి.

    శరీర అవయవాలు, వాటి పని, కుటుంబసభ్యులు, బంధుత్వాలు అర్థమయ్యేలా ఆటలు, యాక్టివిటీస్, క్లాపింగ్ నేమ్ నిర్వహించాలి.  

    పుట్టినరోజులు జరపడం ద్వారా కుటుంబంలో పిల్లల విలువను వారికి తెలిసేలా చేయాలి. పిల్లలను స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. మాట్లాడనివ్వాలి.

    కథలను చెప్పడం, గట్టిగా చదవడం, పెద్ద పుస్తకాలు, బొమ్మలు, కథల పుస్తకాలను టీచర్లు ఉపయోగించాలి.

    చిన్న చిన్న కుర్చీలు, టేబుళ్లు ఉండాలి. కుర్చీల్లో కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు తప్పనిసరిగా నేలకు ఆనేలా ఉండాలి.

                కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ను కేంద్రం తప్పనిసరి చేయనుంది.