పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్రం..

పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్రం..

హైదరాబాద్‌‌, వెలుగు: పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరతో పంటల కొనుగోళ్లను 25 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. ఎంఎస్‌‌పీతో కొనుగోలు చేసే శనగలు, పెసర్లు, కందులు, మినుములు, సోయా బీన్‌‌ వంటి పంటలను కేంద్రం ఏటా సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌‌ ద్వారా ఈ కొనుగోళ్లు చేపడుతోంది. నాఫెడ్‌‌, మార్క్‌‌ఫెడ్‌‌ను నోడల్‌‌ ఏజెన్సీగా నియమించి కొనుగోళ్లు చేస్తోంది. రాష్ట్రంలో సాగైన పంటల నుంచి వచ్చిన దిగుబడి అంచనాల్లో 25 శాతం పంటలను కేంద్రం సేకరిస్తోంది. అయితే కేంద్రం కొనుగోళ్లు చేయగా మిగిలిన పంటను రాష్ట్రం మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా సేకరిస్తోంది. 

పంట కొనుగోళ్లను పెంచిన కేంద్రం

అయితే రాష్ట్ర ప్రభుత్వం నష్టం వస్తుందని పంటల కొనుగోళ్లు చేపట్టడం లేదు. దీంతో రైతులు మార్కెట్‌‌లో అగ్గువకు అమ్ముకోవాల్సి వస్తోంది. తాజాగా కేంద్రం దిగుబడి అయ్యే పంటల్లో 40 శాతం కొనుగోలు చే యాలని నిర్ణయించింది. దీంతో కందులు, పెసర్లు, మినుములు, జొన్నల కొనుగోలుకు మార్గం లైన్​ క్లియర్​అయ్యింది.   

మార్క్‌‌ఫెడ్‌‌ అప్పులకు కష్టమే

మార్కెట్‌‌లో రేటు మద్దతు ధర కంటే తక్కు వ ఉన్న సమయంలో కేంద్రం కోట పోగా మి గిలిన పంటలను మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా కొని రాష్ట్ర సర్కారు నష్టానికి అమ్ముకునే పరిస్థితి ఉండేది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో పంటల్లో 40 శాతం పోగా మిగిలిన పంట తక్కువ ధర ఉంటేనే మార్క్‌‌ఫెడ్‌‌ సేకరిస్తుంది. మార్కెట్‌‌లో మంచి ధరలు ఉంటే బహిరంగ మార్కెట్‌‌లోనే అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అయితే, పంటల కొనుగోలు పేరుతో మార్క్‌‌ఫెడ్‌‌ కు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీగా ఇస్తే అప్పులు తెచ్చుకొని నడిపిస్తున్నారు. తెలంగాణ వచ్చి నప్పటి నుంచీ ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.1,100 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీం తో ఇప్పటికే మార్క్‌‌ఫెడ్‌‌ రూ.3,600 కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కేం ద్రం తాజా నిర్ణయంతో మార్క్‌‌ఫెడ్‌‌కు వెసులుబాటు కలుగుతుందా? లేక మరింత ఇబ్బందేనా? అనే డైలమా కొనసాగుతోంది.