కర్నాటక, బీహార్ లకు NDRF నుంచి నిధులు

కర్నాటక, బీహార్ లకు NDRF నుంచి నిధులు

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి కర్నాటక, బీహార్ కు నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం పడిన భారీ వర్షాలకు  పలు రాష్ట్రాలలో మౌళికసదుపాయాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం.. కర్నాటకు 1200 కోట్ల రూపాయలను, బీహార్ కు మొదటి విడతగా 400 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్రం. బీహార్ లోని పాట్నాలో వర్షం తగ్గినా వరదలు మాత్రం ఇంకా వస్తున్నాయి. దీంతో ప్రజలకు అంటువ్యాదులు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అధికారులు. శుక్రవారం బీహార్ సీఎం నితీష్ ఎరియల్ సర్వే చేసి ప్రస్తుత పరిస్తితులను సమీక్షించారు.