లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు వంటి కొన్నింటిని మినహాయిస్తే మిగతా చోట్ల కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. కొన్ని నగరాల్లో వ్యాపారులే సెల్ఫ్ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు మరోసారి లాక్డౌన్ విధించే ప్రపోజల్స్ను పరిశీలిస్తున్నాయి. కేంద్రంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేసేదిశగా దాని అడుగులు పడుతున్నాయి. ఈ నెల 31 తరువాత విమానాలకు, సినిమా హాల్స్కు, జిమ్స్కు కూడా పర్మిషన్లు ఇవ్వాలనే వత్తిడి ప్రభుత్వం మీద నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిమితులను సడలించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని ఇంటర్నేషనల్ ఫ్లైట్లలోకి అనుమతించాలనే ప్రపోజల్ను పరిశీలిస్తోంది. సినిమా హాల్స్ తెరుచుకోవడానికి పర్మిషన్లు ఇస్తారని, అయితే చిన్నారులను, ముసలివాళ్లను అనుమతించే అవకాశాలు ఉండవని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లను ఎలా నడపాలనే విషయంపైనా మాటామంతీ జరుగుతున్నదని వివరించారు. గరిష్టంగా 72 గంటల ప్రయాణానికి మాత్రమే అనుమతిస్తారు. ఎయిర్పోర్టులో దిగాక, వారి సొంత ఖర్చుతో కరోనా టెస్టులు చేయించుకోవాలి. 45 నిమిషాలపాటు పట్టే ఈ టెస్టుకు రూ.500 చెల్లించాలి. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ టెస్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. కరోనా పాజిటివ్ వస్తే సొంత ఖర్చులతోనే క్వారంటైన్లో ఉండాలి.ఎకానమీని సాధారణ స్థాయికి తీసుకురావడానికే రిస్ట్రిక్షన్లను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇందుకోసం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటామని సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

For More News..

మన దేశంలో గూగుల్ పెట్టు బడి 75 వేల కోట్లు

మాకు ట్యాక్సులు పెంచండి

జూన్ 30న కేబినెట్ మీటింగ్ జరిగిందా?