విదేశాల్లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డొమెస్టిక్ కంపెనీలకు బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

విదేశాల్లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డొమెస్టిక్ కంపెనీలకు బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలోని ప్రైవేట్ కంపెనీలకు బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేలా ప్రభుత్వం శుక్రవారం కొన్ని  నిర్ణయాలు తీసుకుంది. లిథియం మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ కంపెనీలు అనుమతి ఇవ్వడంతో పాటు, విదేశీ స్టాక్ ఎక్స్చేంజిల్లో ఇండియన్ కంపెనీలు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్ అయ్యేందుకు ఆమోదం తెలిపింది. 

విదేశీ మార్కెట్ల నుంచి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరణ..

ఫారిన్ స్టాక్ ఎక్స్చేంజిల్లో, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) లో  ఇండియన్ కంపెనీలు ఇక నుంచి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  లిస్టింగ్ కావొచ్చని శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కరోనా రిలీఫ్ ప్యాకేజిలో భాగంగా మూడేళ్ల కిందట ఈ ప్రకటన చేయగా, తాజాగా అనుమతులు వచ్చాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న వివిధ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ చేయడం ద్వారా కంపెనీలు ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించడానికి వీలుంటుంది. అంతేకాకుండా లిస్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంకా లిస్ట్ కాని కంపెనీలు ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఎక్స్చేంజిల్లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్ అవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని  కార్పొరేట్ డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మార్కెట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వివరించారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం, కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ కావాలనుకుంటే దేశ స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముందు లిస్టింగ్ కావాలి. డొమెస్టిక్ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిటరీ రిసీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ద్వారా విదేశాల్లో లిస్టింగ్ అవుతున్నాయి.  ఇన్ఫోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విప్రో వంటి కంపెనీల ఏడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు న్యూయార్క్ స్టాక్  ఎక్స్చేంజిల్లో ట్రేడవుతున్న విషయం తెలిసిందే.  

10 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజిల్లో..

విదేశాల్లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతి దొరకడంతో యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పెద్ద ఊరట లభించిందని చెప్పొచ్చు.  రిలయన్స్ జియో  యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అవ్వాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పటికే కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ వంటి బడా కంపెనీల నుంచి 20 బిలియన్ డాలర్లను సేకరించింది. ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అదే ఆలోచనలో ఉంది.   కాగా, బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెనడా, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా  ఏడు దేశాల్లో ఇండియన్ కంపెనీలు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్ అయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని గతంలో వార్తలొచ్చాయి. యాంటి మనీలాండరింగ్ రూల్స్ కఠినంగా ఉన్న 10 ఎక్స్చేంజిల్లో కంపెనీలు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లిస్టింగ్ అయ్యేందుకు సెబీ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్ రెడీ చేసింది. ఇందులో న్యూయార్క్ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జపాన్, సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరియా, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెనడా వంటివి ఉన్నాయి.  ఇంకొన్ని వారాల్లో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటకురానున్నాయి. 

డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బూస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రైసిస్ వస్తే ఇన్వెస్టర్లను కాపాడేందుకు  కార్పొరేట్ డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీడీఎండీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ను ప్రభుత్వం లాంచ్ చేసింది. దీంతో   మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, కార్పొరేట్ డెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ పెరుగుతాయని  ఎనలిస్టులు భావిస్తున్నారు. 

లిథియం మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓకే..

లిథియం వంటి కీలకమైన మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మైనింగ్ చేయడానికి  ప్రైవేట్ కంపెనీలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మైన్స్ అండ్ మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ రెగ్యులేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సవరణ బిల్లుకు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం కేవలం ప్రభుత్వ కంపెనీలు మాత్రమే లిథియం మినరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి వీలుంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి, నేషనల్ సెక్యూరిటీ కోసం మినరల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరిన్ని సంస్కరణలు అవసరం’ అని ఈ బిల్లులో ఉంది. ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కంపెనీలకు లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇష్యూ  చేస్తారు. ఈ బిల్లుకు ఈ నెల ప్రారంభంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కంపెనీలు తాము ఏ ఏరియాల్లో మినరల్స్ కోసం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోర్ చేయాలనుకుంటున్నాయో ప్రభుత్వానికి సలహా ఇవ్వొచ్చు. ఆ తర్వాత మైనింగ్‌‌‌‌‌‌‌‌కు అనుమతి వస్తుంది.  సాధారణంగా అయితే ప్రభుత్వమే ఆక్షన్ వేయాలనుకునే మినరల్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గుర్తిస్తుంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాలా దేశాలు గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరుగుతోంది. గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింతగా విస్తరించాలంటే బ్యాటరీల తయారీలో వాడే లిథియం చాలా ముఖ్యం. లిథియంతో పాటు కాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెల్లారియం, సెలెనియం, లెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాడ్మియం, ఇడియం, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైమండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాస్ఫెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అపటైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పొటాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంకా అసాధారణమైన మెటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇక నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా మైనింగ్ చేయడానికి వీలుంటుంది. కోబాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేనియం, టంగస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నికెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లాటినం వంటివి కూడా ఈ లిస్టులో ఉన్నాయి. దేశంలోని 6,88,000 చదరపు కిలోమీటర్ల ఏరియాలో మినరల్స్ దొరికే అవకాశం ఉందని అంచనా.