తెలంగాణలో అధికారం మారుతుంది 

తెలంగాణలో అధికారం మారుతుంది 

భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారుతుందని.. తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ప్రచారం చేస్తున్నారని.. ఇది వాస్తవం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలుకు వాస్తవ విషయాలు తెలియచేయాలని సూచించారు. ఎన్నికల్లో గెలవనే కారణంతో 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించారు..కానీ.. అప్పుడు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఛత్తీస్ గఢ్, జార్ఖండ్.. తదితర రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని.. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు రాలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువత ఎన్నో పోరాటం చేశారని గుర్తు చేశారు. నేటికి తెలంగాణ విమోచన దినం జరపడం లేదని విమర్శించారు.  తెలంగాణ ఏర్పాటుకు చాలా చరిత్ర ఉందని, సంస్కృతి, సంప్రాదాయాలు భరతమాతకు మకుటాలుగా అభివర్ణించారు. తెలంగాణ విముక్తి కోసం చాలా మంది పోరాటం చేశారని.. వారందరినీ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం సంకెళ్ల నుంచి ముక్తి కోసం సర్దార్ పటేల్ చేసిన పోరాటం గొప్పదన్నారు. పటేల్ పోలీస్ యాక్షన్ చేయకుంటే.. భారత్ ఇలా ఉండేది కాదన్నారు. ఇందుకు పటేల్ కు దేశం రుణ పడి ఉంటుందన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా.. వారిని సాదరంగా స్వాగతించడమే కాకుండా సన్మానిస్తామన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగమిస్తుందని మంత్రి అమిత్ షా వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం 

సోనియా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

గవర్నర్కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు