కోటి దీపోత్సవంలో రాజ్​నాథ్​సింగ్​ పూజలు

కోటి దీపోత్సవంలో రాజ్​నాథ్​సింగ్​ పూజలు
ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్​ స్టేడియంలో కోటి దీపోత్సవం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో, కాశీ విశ్వనాథుని కల్యాణోత్సవంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ పాల్గొన్నారు. జ్యోతిర్లింగాలకు, కాశీ విశ్వనాథునికి హారతి ఇచ్చారు. భక్తులు మహాదేవునికి కోటి పుష్పార్చన చేశారు.