
యాదాద్రి, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం రామన్నపేట మండలం సర్నేనిగూడెం, జనంపల్లి, ఇస్కిల, కక్కిరేణి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న పలు ఇండ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అనంతరం సీసీ రోడ్లను ప్రారంభించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం కేతేపల్లి మండలంలోని భీమారం, కొప్పోలు, ఉప్పలపహడ్, ఇనుపాముల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టులను కాంగ్రెస్ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు