
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి కృషి చేసి పూర్వ వైభవం తీసుకొస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కార్యదర్శిగా ఉన్నప్పుడు 51 దవాఖానలు, షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించి పబ్లిక్ క్లబ్ కు నెలకు రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చేలా పని చేశామని తెలిపారు.
గత పాలకవర్గం చేసిన అవినీతిని తప్పిదాలను సరిచేయడానికి 6 నెలల సమయం పట్టిందని చెప్పారు. త్వరలో సూర్యాపేట పట్టణ ప్రజలకు, పబ్లిక్ క్లబ్ సభ్యులకు అందుబాటులో ఉండేలా స్విమ్మింగ్ ఫుల్ నిర్మిస్తామని తెలిపారు. అనంతరం పబ్లిక్ క్లబ్ లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, పబ్లిక్ క్లబ్ ఉపాధ్యక్షుడు మర్రు హనుమంతరావు, కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు శెనగాని రాంబాబు, బత్తిని వెంకటేశ్వర్లు, ఫరుదుద్దీన్ అహ్మద్, పోలేబొయిన నర్సయ్య యాదవ్, గవ్వ కేశవరెడ్డి, రాచకొండ శ్రీనివాస్, నిమ్మల వెంకటేశ్వర్లు, చల్లా సత్యనారాయణ, పబ్లిక్ సీనియర్ సభ్యులు కుమ్మరికుంట్ల లింగయ్య, వెలుగు కరుణాకర్, సంపత్, దుర్గారావు పాల్గొన్నారు.