అహింసా మార్గంలోనే పోరాటం కొనసాగిస్తాం

అహింసా మార్గంలోనే పోరాటం కొనసాగిస్తాం

వ్యవసాయచట్టాలు రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు రైతులు. ఇవాళ ఐదోసారి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లోనూ ఇదేవిషయాన్ని తేల్చి చెప్పారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. కార్పొరేట్ ఫార్మింగ్ తో ప్రభుత్వమే లాభపడుతుంది తప్ప.. రైతులకు ఒరిగేదేం లేదని కేంద్ర మంత్రులకు చెప్పారు నాయకులు. తాము ఏడాదికి సరిపడా ఆహారపదార్థాలు తీసుకునే రోడ్లపైకి వచ్చామని.. మరో ఏడాదైనా రోడ్లపైనే ఉంటామన్నారు. తాము రోడ్లపైనే ఉండాలని సర్కారు కోరుకుంటే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అహింసా మార్గంలోనే తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.