CSIR-CSMCRI రిక్రూట్‌మెంట్ 2026: పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం!

CSIR-CSMCRI రిక్రూట్‌మెంట్ 2026: పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం!

సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ సీఎస్ఎంసీఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టులు.

మొత్తం ఖాళీలు: 62.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ మెరైన్ సైన్సెస్, ఎంఎస్సీ కెమిస్ట్రీ/ బోటనీ/ బయోటెక్నాలజీ/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ మెరైన్ సైన్సెస్, బీఈ/ బి.టెక్ కెమికల్/ 
ఐటీ/ సీఎస్/ సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, బయోలాజికల్/ కెమికల్/ ఫార్మాస్యూటికల్/ అగ్రికల్చరల్ సైన్సెస్​లో  పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.csmcri.res.inను సందర్శించండి.