
సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సెంట్రల్ సెక్రటేరియట్ టీం పర్యటన కొనసాగుతోంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తున్నారు. మూడో రోజు మర్కల్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్, మల్లన్న గట్ట వద్ద మిషన్ భగీరథ, అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామ శివార్లోని గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ విజిట్ చేసినట్లు ఎంపీడీవో సంతోశ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాజు, ప్రశాంత్, ఏపీవో మధు, టీఏ సంతోశ్, అంగన్వాడీ టీచర్లు, మిషన్ భగీరథ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.