రాష్ట్రంలో పెసలు, మినపప్పు, సోయాబీన్ సేకరణకు కేంద్రం ఆమోదం

రాష్ట్రంలో పెసలు, మినపప్పు, సోయాబీన్ సేకరణకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పప్పు దినుసులు, సోయాబీన్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025– 26 ఖరీఫ్ సీజన్ కోసం తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణ ప్రణాళికను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించారు. మొత్తం రూ.15,095.83 కోట్లతో ఈ 4 రాష్ట్రాల నుంచి సేకరణ చేపట్టనున్నారు. ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం- ఏఏఎస్ హెచ్ఏ), ఇతర స్కీంల ద్వారా ఈ సేకరణ అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో శివరాజ్​సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  తెలంగాణ నుంచి పెసర, మినపప్పు సోయాబీన్ సేకరణకు ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నది. రాష్ట్రంలో 4,430 టన్నుల పెసలు సేకరించనుంది. ఇందుకోసం ప్రైజ్ సపోర్ట్ స్కీం కింద రూ.38.44 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. సీఎస్ఎస్​ కింద రాష్ట్రంలో పండిన పెసర, మినుములు 100% , సోయాబీన్ 50 శాతం సేకరించాలని ఈ మీటింలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కేంద్రాన్ని కోరారు.