రెమిడెసివిర్ ఎగుమతులపై కేంద్రం బ్యాన్

రెమిడెసివిర్ ఎగుమతులపై  కేంద్రం బ్యాన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్స్ కు ట్రీట్మెంట్ లో కీలకమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ తో పాటు రెమిడిసివిర్ యాక్టివ్ ఫార్మాన్యూటికల్ ఇన్ గ్రేడియంట్ (API) ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దేశంలోని కరోనా పేషంట్ లు, ఆస్పత్రుల్లో రెమిడేసివిర్ అందుబాటులో ఉండేందుకు, వాటి కొరత రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిసిమిర్ ఇంజక్షన్ కరోనా తీవ్రతను తగ్గించడంలోనూ విజయవంతంగా పని చేస్తోంది. వీటిని యూఎస్ దిగ్గజ ఫార్మా కంపెనీ గిలీడ్ సైన్సెస్ నుంచి వాలంటరీ లైసెన్సింగ్ తీసుకొని చాలా కంపెనీలు మన దేశంలో తయారు చేస్తున్నాయి. భారత్ లో ప్రతి నెలా సుమారుగా 38.80 లక్షల రెమిడిసివిర్ ఇంజక్షన్లు  రూపొందుతుండటం విశేషం.