హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి విమర్శించారు. రెండున్నర ఏళ్ల నుంచి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలేదని, నిధుల మంజూరుపై వివక్ష చూపిస్తోందన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై జయవీర్ రెడ్డి మాట్లాడారు. యుపీఏ ప్రభుత్వంలో అప్పటి ప్రధాని ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేస్తే 12 ఏళ్ల నుంచి కేంద్రం ఈ ప్రాజెక్టు వెళ్లడానికి సహకరించడం ఆరోపించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదని వారు రాష్ర్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం దళితులకు మూడెకరాల ఇస్తామని చెప్పి మోసం చేసిందని, దళిత బంధు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ రెండు స్కీమ్ ల అమలులో అక్రమాలు జరిగాయని వీటిపై రాష్ర్ట ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. రాష్ర్టంలో ఈవీలకు డిమాండ్ పెరింగిందని, చార్జింగ్ స్టేషన్లను పెంచాలని కోరారు.
