- సీరం ఇన్‌స్టిట్యూట్ అభ్యర్థనతో పాత నిర్ణయం వెనక్కి తీసుకున్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: చిన్నారులకు ఇచ్చే బీసీజీ, మీజిల్స్ వంటి కీలక వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ తాజా ఉత్తర్వులతో పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో వ్యాక్సిన్ల ధరలపై 17.10 శాతం మొనోపొలీ రిడక్షన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీకాల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన రివ్యూ పిటిషన్‌ను పరిశీలించిన కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
హోల్‌సేల్ ధరల సూచీ ఆధారంగా 0.64956% పెంపుతో కొత్త ధరలను ఖరారు చేసింది. తాజా ధరల ప్రకారం బీసీజీ వ్యాక్సిన్(0.10 ఎంఎల్) ఒక్క డోసు రూ.9.89గా నిర్ణయించింది. మీజిల్స్-రుబెల్లా వ్యాక్సిన్(0.5ఎంఎల్) ధర రూ.87.93కి, మీజిల్స్ వ్యాక్సిన్ (0.5 ఎంఎల్) ధర రూ.62కు పెరిగింది.
