ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు, ఓటీటీలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు, ఓటీటీలపై కేంద్రం కీలక నిర్ణయం

ఓటీటీ ఫ్లాట్ పామ్స్, యూట్యూబ్ ఛానల్స్ పై  కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్, కంటెంట్ ప్రొవైడర్స్ ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంది. దీంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి OTT ప్లాట్ ఫామ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ పరధిలోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సైన్ చేశారు. OTT స్ట్రీమింగ్ అలాగే వేర్వేరు డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్ని కూడా సమాచార శాఖ పరిధిలోకి రానున్నాయి. ఇకపై  కొత్తగా యూట్యూబ్ ఛానెల్స్, ఓటీటీలు ఓపెన్ చేయాలంటే   కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి.