కేరళలో ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా

కేరళలో ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా యి. దక్షిణ, మధ్య కేరళలోని జిల్లాలపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.  కేరళలో భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.  కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని తెలిపారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు వెల్లడించారు.  ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు అమిత్ షా.