ఒమిక్రాన్​పై టీకాల పనితీరును ఇప్పుడే చెప్పలేం

ఒమిక్రాన్​పై టీకాల పనితీరును ఇప్పుడే చెప్పలేం
  • ఎంపీలు రేవంత్, నామా ప్రశ్నలకు కేంద్రం ఆన్సర్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రస్తుత కరోనా టీకాలు బాగా పనిచేస్తయా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని, దీనికి సంబంధించి ప్రస్తుతం సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ చెప్పారు. తెలంగాణ ఎంపీలు రేవంత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, ఇతర రాష్ట్రాల ఎంపీలు పలువురు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు శుక్రవారం మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాలను ఎట్ రిస్క్ కంట్రీస్ లిస్టులో పెట్టామని, ఆయా దేశాల్లో పరిస్థితిని బట్టి ఈ లిస్టును అప్ డేట్ చేస్తామన్నారు. ఈ దేశాల నుంచి వచ్చేటోళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు, ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేశామని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్లలో 2 శాతం మందికి ర్యాండమ్‌గా టెస్టులు చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చేటోళ్లకు పాజిటివ్ వస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్ పంపుతున్నామన్నారు.