సెంచరీ మ్యాట్రెసెస్ నుంచి సోఫాలు

సెంచరీ మ్యాట్రెసెస్ నుంచి సోఫాలు

 హైదరాబాద్, వెలుగు: పరుపులు తయారు చేసే సెంచరీ మ్యాట్రెసెస్​ సోఫాల విభాగంలోకి  ప్రవేశించింది.  తన బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సోఫాలను లాంచ్​ చేసింది. మూడు సీట్లు, రెండు సీట్లు, సింగిల్ సీటర్, లాంజర్​ కాన్ఫిగరేషన్లలో ఇవి లభిస్తాయి.  ఈ సందర్భంగా కంపెనీ ఈడీ ఉత్తమ్​మలానీ మీడియాతో మాట్లాడుతూ ‘‘హైదరాబాద్​లో మాకు ఇది వరకే మూడు ఎక్స్​పీరియన్స్​ సెంటర్లు ఉన్నాయి. 

కొత్తగా మరొకటి ఏర్పాటు చేశాం. మనదేశ సోఫాల మార్కెట్​సైజు రూ.50 వేల కోట్ల వరకు ఉంటుంది. రాబోయే మూడేళ్లలో సోఫా మార్కెట్లో 20 శాతం వాటా సంపాదించడం మా లక్ష్యం. సోఫాల తయారీ కోసం హైదరాబాద్​లో రూ.35 కోట్లు ఇన్వెస్ట్​  చేశాం. హైదరాబాద్​లో మాకు 4 తయారీ యూనిట్లు ఉన్నాయి”అని ఆయన వివరించారు.