
నిజమాబాద్ లోక్ సభ ఎన్నికలను వరల్డ్ రికార్డుగా గుర్తించాలని గిన్నిస్ బుక్ సంస్థకు లేఖ రాసినట్లు చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎలక్ట్రానిక్ వోటింగ్ వేదిక మీద ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఉపయోగించినట్లు చెప్పారు.సాధారణంగా నియోజకవర్గానికి 12 నుంచి 16 మంది ఇంజినీర్లు పని చేస్తే..ఒక్క నిజమాబాద్ స్థానానికి 600 మంది ఇంజినీర్లు పని చేసినట్లు చెప్పారు.
నిజమాబాద్ పసుపు రైతులు ప్రభుత్వం పై నిరసన తెలపడానికి ఎంపీ ఎన్నికలలో పోటీచేశారు.చాలాకాలం నుంచి జిల్లాలో పసుపు బోర్డును, శీతల గిడ్డంగిని చేయాలని,15 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఎలక్షన్ లో పాల్గోని తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో ఏక కాలంలో 175మంది రైతులు ఎన్నికలలో పోటీ చేశారు.