
న్యూఢిల్లీ: ఆంథెమ్ బయోసైన్సెస్ తన రూ. 3,395 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జూలై 14న ప్రారంభించనుంది. ఇది 16న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒక రోజు బిడ్డింగ్ జులై 11న నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్విధానంలో ఉంటుంది. ఫ్రెష్ఇష్యూ లేదు.
ప్రమోటర్లు, పెట్టుబడిదారులు, వాటాదారులు రూ. 3,395 కోట్ల విలువైన షేర్లను అమ్ముతారు. కంపెనీకి ఈ ఇష్యూ నుంచి నిధులు లభించవు. మొత్తం ఆదాయం వాటాదారులకే వెళ్తుంది.