కరోనా టైం: ఇంటింటి సర్వే వాయిదా వేయాలన్న సెర్ఫ్ ​ఫీల్డ్​ స్టాఫ్

కరోనా టైం: ఇంటింటి సర్వే వాయిదా వేయాలన్న సెర్ఫ్ ​ఫీల్డ్​ స్టాఫ్
  • సెర్ఫ్ పెద్ద ఆఫీసర్ల తీరుపై ఫీల్డ్​ స్టాఫ్ నిరసన
  • సర్వే వాయిదా వేయాలంటున్న ఎంప్లాయ్స్​

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ స్పీడ్​గా స్ప్రెడ్ అవుతున్న టైంలో సెర్ఫ్(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్​కేసులు పెరిగిపోతున్నాయి. వారిలో చాలా వరకు పేషెంట్లు హోం ఐసోలేషన్​లో ఉంటూ ట్రీట్​మెంట్​చేయించుకుంటున్నారు. స్థానికులే పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళల వివరాలు ఎలా సేకరించాలని సెర్ఫ్​ఫీల్డ్​స్టాఫ్​ప్రశ్నిస్తున్నారు. చాలా ఊళ్లలో ప్రజలు ఇండ్లకు రానివ్వడం లేదని చెబుతున్నారు. కానీ సెర్ఫ్​ఉన్నతాధికారులు మాత్రం తప్పకుండా సర్వే చేయాలని, మహిళ ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అప్​డేట్ చేయాలని, ఫొటోలు తీసి అప్ లోడ్​చేయాలంటున్నారు. సెర్ఫ్​స్టేట్​ఎంప్లాయ్స్ జాయింట్ యాక్షన్​ కమిటీ పిలుపు మేరకు కరోనా తీవ్రత తగ్గేవరకు ఇంటింటి సర్వే వాయిదా వేయాలని డిమాండ్​చేస్తూ ఇప్పటికే అన్ని జిల్లాల్లోని డీఆర్​డీఏ అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా ఎలాంటి స్పందన లేదు. దీంతో ఫీల్డ్​సిబ్బందిలో
అసహనం పెరిగిపోతుంది. 

50 లక్షల మందికి పైనే..

అన్ని జిల్లాల్లో 5 లక్షలకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు(ఎస్​హెచ్​జీ)లు ఉన్నాయి. వాటిలో 50 లక్ష మందికి పైనే మహిళలు సభ్యులుగా ఉన్నారు. 20 వేల గ్రామ సమాఖ్యలు, 586 మండల సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు పని చేస్తున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఎస్ హెచ్​జీలలో సభ్యులైన మహిళల వివరాలు, ఆధార్, మొబైల్, బ్యాంక్​ అకౌంట్ నంబర్లతో సహా ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో ఎంట్రీ చేశారు. ఆ
సమాచారం  ఆధారంగానే వివిధ స్కీంలు అమలవుతున్నాయి. కాగా ప్రభుత్వ సైట్​లోని వివరాలు సరిగా ఉన్నాయా.. లేదా? ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్​చేయాలని ఎస్ హెచ్ జీ వారీగా సభ్యులందరి డీటెయిల్స్​రీ ఎంట్రీ చేయాలని సెర్ఫ్​ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మహిళ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఎస్ హెచ్ జీ పేరు, వారి పేరు, ఆధార్ కార్డ్, మొబైల్, బ్యాంకు అకౌంట్​నంబర్లను ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరికి మాస్క్​లేకుండా ఫొటో తీసి అప్​లోడ్​చేయాలని పేర్కొన్నారు. ఎస్​హెచ్ జీ మెంబర్​చనిపోయినా, వలస వెళ్లి అందుబాటులో లేకుండా ఉన్నా గ్రూప్​నుంచి తొలగించి కొత్తవారిని చేర్పించాలని చెప్పారు. టార్గెట్​కంప్లీట్​చేయకపోతే సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీడియో కాన్ఫరెన్స్​లో హెచ్చరించారని ఫీల్డ్​ స్టాఫ్​ తెలిపారు.

త్వరలో కార్యచరణ ప్రకటిస్తాం

ఇప్పటికే డీఆర్​డీఏ జిల్లా అధికారులు సెర్ఫ్​స్టాఫ్​తో మీటింగులు పెట్టి సర్వే ప్రాసెస్​పై వివరించారు. ఆయా మండలాల ఏపీఎంలు సంబంధిత యాప్ డౌన్​ లోడ్​చేయించి వీఓఏల ద్వారా సర్వే స్టార్ట్​చేశారు. అయితే ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఒక ఏపీఎం, ఆదిలాబాద్ జిల్లాలో ఒక సీసీ కరోనాతో చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 మంది సెర్ఫ్​స్టాఫ్ కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో సర్వే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సెర్ఫ్​ఎంప్లాయ్స్ జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.