ఏబీవీపీ రాష్ట్రీయ కళామంచ్ నేషనల్ కో కన్వీనర్‌‌‌‌గా మణికంఠ

ఏబీవీపీ రాష్ట్రీయ కళామంచ్ నేషనల్ కో కన్వీనర్‌‌‌‌గా మణికంఠ
  • ఢిల్లీలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో నియామకం 

శంషాబాద్, వెలుగు: ఢిల్లీలో జరిగిన ఏబీవీపీ 69వ జాతీయ మహాసభల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్‌‌పల్లి  గ్రామానికి చెందిన సీహెచ్ మణికంఠను రాష్ట్రీయ కళామంచ్ నేషనల్ కో కన్వీనర్‌‌‌‌గా నియమించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రాజ్ చరణ్ షాహి, యగ్లవల్క శుక్లా తెలిపారు.

3 ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ..  తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.  తనకు అప్పగించిన  బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.   విద్యార్థి కళాకారులకు రాష్ట్రీయ కళా మంచ్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.