టీటీడీకి సలహాలు ఇచ్చేందుకు పదవులు అవసరం లేదు:చాగంటి

 టీటీడీకి సలహాలు ఇచ్చేందుకు పదవులు అవసరం లేదు:చాగంటి

టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదన్నారు. టిటిడికి అవసరం అనిపించినప్పుడు  తప్పుకుండా ముందు ఉంటానని చెప్పారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరరస్వామి వారే తన ఊపిరి అని చాగంటి స్పష్టం చేశారు.

ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ (TTD) కీలక పదవినిచ్చి గౌరవించింది. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ జనవరిలో టీటీడీ  నిర్ణయించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో జనవరి 20 టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో HDPP, SVBC కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.