ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేయండి : మేయర్ గుండు సుధారాణి

ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేయండి : మేయర్  గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్​ వరంగల్​ చెత్త తరలింపు వాహనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని బల్దియా మేయర్  గుండు సుధారాణి బల్దియా ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ బాల సముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న వాహన షెడ్ ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు. 

వెహికల్ షెడ్ ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ర్యాంపు మరమ్మతులు పూర్తిచేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం వరంగల్ జిల్లా వయోజన విద్యా శాఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన అమ్మకు అక్షర మాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.