మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి : కలెక్టర్లు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి : కలెక్టర్లు

మహబూబాబాద్/ జయశంకర్​భూపాలపల్లి/ ములుగు/ కాశీబుగ్గ, వెలుగు: మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని పార్టీల నేతలు సహకరించాలని కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్​కలెక్టరేట్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు అద్వైత్​ కుమార్​ సింగ్, రాహుల్​ శర్మ, దివాకర, సత్యశారద ఓటర్​ జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా, అనర్హులను జాబితాలో నుంచి తొలగించేలా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. అభ్యంతరాలు ఉంటే గడువులోగా సమర్పించాలని, ఫీల్డ్​ స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.