మర్యాదను బట్టి బిల్లు

మర్యాదను బట్టి బిల్లు

కస్టమర్లు ఆర్డరిచ్చే తీరును బట్టి బిల్లు వేస్తోంది లండన్​లో ఉన్న ‘చాయ్​ స్టాప్’ కేఫ్​. ఉదాహరణకు వెయిటర్​తో కస్టమర్​ ​‘చాయ్​’ అని కాస్త గట్టిగా అంటే.. అప్పుడు టీ ధర ​5 పౌండ్లు. అదే ‘చాయ్​ ప్లీజ్’ అంటే.. మూడు పౌండ్లు. ఇక ‘హలో, చాయ్​ ప్లీజ్​’ అని ఆర్డరిస్తే మాత్రం కేవలం1.90 పౌండ్లే!

కస్టమర్లు తరచూ వెయిటర్స్​ను విసుక్కోవడం, కించపరుస్తుండడంతో ఆ కేఫ్​ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, కస్టమర్​ బిహేవియర్​ను బట్టి చాయ్​ రేట్​ను చెప్పే​ బోర్డు కూడా పెట్టింది. ఆ బోర్డ్​ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.