చైన్ స్నాచింగ్కేసులో ఇద్దరి అరెస్ట్

చైన్ స్నాచింగ్కేసులో ఇద్దరి అరెస్ట్

వికారాబాద్, వెలుగు: చైన్​స్నాచింగ్​కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్​చేసినట్లు మోమిన్​పేట సీఐ వెంకట్​నవాబుపేట ఎస్సై అరుణ్​కుమార్​తెలిపారు. గత నెల 26న సాయంత్రం నవాబుపేట మండలంలోని ఎత్రాజ్​పల్లికి చెందిన మీనపల్లి సత్తమ్మ మెడలో నుంచి అర తులం బంగారం కలిగిన 40 గుండ్ల హారాన్ని రాజస్థాన్​కు చెందిన సేవారాం, దీపారాం లాక్కొని పారిపోయారన్నారు. బుధవారం వారిని అరెస్ట్​చేసి, హారాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.