కూకట్పల్లిలో ఆక్రమణల తొలగింపు

కూకట్పల్లిలో  ఆక్రమణల తొలగింపు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని నాలాను ఆక్రమించి వెలసిన అక్రమ  నిర్మాణాలను శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు తొలగించారు. ఐడీఎల్​ చెరువు నుంచి హబీబ్​నగర్​ మీదుగా కూకట్​పల్లి బస్​డిపో నుంచి బాలానగర్​ వైపు ప్రవహిస్తున్న నాలా ఆక్రమణకు గురైంది. దీంతో వర్షాకాలంలో బస్తీలు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ దృష్టికి తీసుకెళ్లారు. ఐడీఎల్ చెరువు నుంచి కూకట్​పల్లి బస్​ డిపో వరకు నాలాకు ఇరువైపులా పలువురు ప్రహరీలు నిర్మించగా వాటిని హైడ్రా కూల్చేసింది. ఏడు అడుగుల నాలా మూడు అడుగులకు కుచించుకుపోగా.. తిరిగి యథాస్థితికి తీసుకొస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. ​