SOT కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

SOT కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

రామచంద్రాపురం పీఎస్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. అశోక్ నగర్ HIG గేట్ వద్ద మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాగే ప్రయత్నం చేశాడు స్నాచర్. ఇది గమనించిన యాదయ్య అనే కానిస్టేబుల్ దొంగను పట్టుకోబోయాడు. దీంతో ఆయనపై చైన్ స్నాచర్ కత్తితో ఎటాక్ చేసి తప్పించుకుని పోయాడు. SOT కానిస్టేబుల్ కు కత్తిపోట్లు తగిలాయి. దీంతో ఆయనను బీరంగూడ కమాన్ దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేశారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.

ప్రస్తుతం కానిస్టేబుల్ యాదయ్య చికిత్స పొందుతున్నాడు. ఈ ఘనటలో ఇద్దరు చైన్ స్నాచర్లు  బైక్ మీద వచ్చి దాడి చేశారు. దుండగలు నిన్న మాదాపూర్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. మళ్ళీ ఇవ్వాళ మియపూర్ వద్ద మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లారు. నిన్నటి నుండి అన్ని పిఎస్ ల పరిధి సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ యాదయ్య మియపూర్ నుంచి ఇద్దరు స్నాచర్లను వెంబడించాడు. ఆర్సీపురం పరిధి అశోక్ నగర్ HIG గేట్ వద్దకు రాగానే కత్తి తో ఎటాక్ చేశా దుండగులు. అయినా ఆ కానిస్టేబుల్ ఇద్దరు చైన్ స్నాచర్లను 7కిలో మీటర్లు చేజ్ చేశాడు. యాదయ్య సైబరాబాద్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.